కమల్ హాసన్ టైటిల్ తో వస్తున్న బెల్లం కొండ గణేష్

కమల్ హాసన్ – రాధికా కాంబినేషన్ లో కళా తాపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘స్వాతిముత్యం’. ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలియంది కాదు. అలాంటి గొప్ప చిత్ర టైటిల్ తో బెల్లం కొండ గణేష్ వస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న కొత్త చిత్రంలో గణేష్ హీరోగా నటిస్తున్నాడు.

లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి స్వాతి ముత్యం అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. మంగళవారం గణేష్ పుట్టిన రోజు సందర్భాంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసి ఆసక్తి పెంచారు. తొలి సినిమాకే అంత పాపులర్ అయిన టైటిల్ ని పెట్టడం సాహసంతో కూడిన వ్యవహారమే అని అంత మాట్లాడుకుంటున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి గెట‌ప్ లో.. మెళ్లో లాప్ టాప్ బ్యాగ్ వేసుకుని గ‌ణేష్‌ కనిపిస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేయనున్నారు.


ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నాడు. పి.డి. ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.