రేపు పీపుల్స్ ప్లాజాలో ‘సార్’ ప్రీ రిలీజ్ వేడుక

ధనుష్ , సంయుక్త మీనన్ జంటగా తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై తెరకెక్కిన మూవీ సార్. తెలుగు , తమిళ్ లో ఒకేసారి ఫిబ్రవరి 17 న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు సాంగ్స్, టీజర్ , ట్రైలర్ ఇలా అన్ని కూడా సినిమా ఫై ఆసక్తి , అంచనాలు పెంచేసాయి. సినిమా రిలీజ్ రెండు రోజులే ఉన్న క్రమంలో సినిమా తాలూకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో ధనుష్​ లెక్చరర్ గా నటించగా , మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. సాయికుమార్, తనికెళ్ల భ‌‌ర‌‌ణి, సముద్ర ఖని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కాలేజ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థను కొంతమంది వ్యక్తులు ఎలా బిజినెస్ గా మారుస్తున్నారనే అంశాలపై ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు.