మరోసారి తారకరత్న ఫై తనకున్న ప్రేమను చాటుకున్న అలేఖ్యరెడ్డి

మరోసారి తారకరత్న ఫై తనకున్న ప్రేమను చాటుకుంది అలేఖ్యరెడ్డి. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో, సినీ లోకంలో విషాదం నెలకొంది. ఈ విషాదం నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా కోలుకోలేకపోతున్నారు.

తాజాగా ఆమె తన భర్తపై తనకున్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ జన్మకు నువ్వు నేను మాత్రమే జీవితానికి సరిపడా మెమోరీస్ ఇచ్చివెళ్లావు’అని ఆమె పేర్కొన్నారు. తారకరత్నే తన లోకమని చెప్పుకొచ్చింది. తారకరత్న మెమోరీస్తోనే ఈ జీవితాంతం బతికేస్తాను అని శ్వాస ఉన్నంత వరకు కూడా తారకరత్ననే ప్రేమిస్తుంటాను అని ఇలా అలేఖ్యా రెడ్డి ఎమోషనల్ పోస్ట్ వేసింది. ఇక పాత ఫోటో ఒకటి అలేఖ్య రెడ్డి షేర్ చేయగా.. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. భర్త దూరమై ఆమె ఎంత బాధపడుతుందో ఆమె పెట్టిన పోస్టు చూస్తే అర్థమౌతోంది. దీంతో…నెటిజన్లు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.