తారకరత్న చికిత్స అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తున్నారు..?

గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ చికిత్స పొందుతున్న తారకరత్న కు సంబదించిన హాస్పటల్ ఖర్చు ఎవరు భరిస్తున్నారనేది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితం నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు. దీంతో వెంటనే ఆయన్ను కుప్పం లోని హాస్పటల్ కు తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పటల్ కు తరలించారు. గత వారం రోజులుగా డాక్టర్స్ తారకరత్న కు చికిత్స అందిస్తూనే ఉన్నారు. కానీ ఇంకా మెరుగుపలేదు. మరికొన్ని రిపోర్ట్స్ వస్తే కానీ చెప్పలేమని , ప్రస్తుతం మాత్రం ఇంకా విషమంగానే ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే తారకరత్న చికిత్సకు ఖర్చులు ఎవరు భరిస్తున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం తారకరత్నకు చికిత్సకు సంబంధించిన పూర్తి ఖర్చులను టీడీపీ పార్టీనే భరిస్తున్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురి కావడం కారణంగా.. ఆ ఖర్చులను తానే భరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకొచ్చారట. పూర్తిగా తానే ఖర్చులు భరిస్తాననే విషయం తారకరత్న సతీమణికి కూడా చెప్పినట్లు చెపుతున్నారు. అయితే నందమూరి కుటుంబంలో ఇతరులతో పోల్చితే తారకరత్న ఆర్థికంగా వెనుకబడి ఉండడం తో తారకరత్న చికిత్సకు అయ్యే భారీ ఖర్చును తానే చెల్లిస్తానని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమైనప్పటికి తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.