రికార్డు బ్రేక్ చేసిన పవన్ అన్ స్టాపబుల్ పార్ట్ 1 ఎపిసోడ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. వెండితెర సినిమానే కాదు స్ట్రీమింగ్ ఎపిసోడ్ అయినా సరే రికార్డ్స్ బ్రేక్ చేయాల్సిందే. బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్ ఆఖరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ తొలి భాగం నిన్న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ పార్ట్ ఎంతో సరదాగా సాగింది. పవన్ కళ్యాణ్‌ను భయ్యా అంటూ బాలయ్య పిలుస్తూ సందడి చేసారు. మొదటి నుండి కూడా ఈ ఎపిసోడ్ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉండే..ఆ అంచనాలకు తగ్గట్లే ఎపిసోడ్ ఉండడం తో అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఆహా టీం ప్రకటించిన ప్రకారం చూస్తే బాలకృష్ణ ఎపిసోడ్ విత్ పవన్ కళ్యాణ్ పార్ట్ 1 కేవలం 14 గంటల్లోనే 100 మిలియన్ వాచ్ మినిట్స్ బ్రేక్ చేసింది. సీజన్ 1 సీజన్ 2 లో చాలామంది స్టార్స్ బాలయ్య షోకి రాగా ఏ ఎపిసోడ్ కి ఈ రేంజ్ లో వాచ్ అవర్స్ రాలేదు. అన్ స్టాపబుల్ షోతో కూడా పవర్ స్టార్ తన స్టామినా చూపించారని చెప్పొచ్చు. పార్ట్ 1 లో చాలా వరకు బాలకృష్ణ ప్రశ్నలకు పవన్ చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తూ వచ్చారు. కేవలం 3 పెళ్లిల్ల విషయంపై మాత్రం వివరణ ఇచ్చారు. ఇక ఇదే ఎపిసోడ్ లో చరణ్ తో కూడా మరోసారి ఫోన్ లో మాట్లాడారు బాలకృష్ణ. ఇక పార్ట్ 1 సూపర్ హిట్ కావడం తో పార్ట్ 2 ఫై మరింత అంచనాలు పెరిగాయి. మరి ఆ ఎపిసోడ్ ఏ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.