చైనాలో మరో వైరస్‌.. హెచ్చరిక జారీ

బుబోనిక్ ప్లేగు వ్యాధి గుర్తింపు..మూడో స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ

Chinese city sounds alert for bubonic plague

బీజింగ్‌: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మంగోలియాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిందని చైనాలోని బయాన్నూర్ నగర అధికారులు హెచ్చరించారు. మంగోలియాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకుతోందని, 19వ శతాబ్దంలో వచ్చిన ప్లేగు వ్యాధితో పోలిస్తే, ఇది మరింత బలమైనదని చెబుతూ నగరంలో మూడో స్థాయి ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. ఈ సంవత్సరం చివరి వరకూ ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయని తెలిపారు. శనివారం నాడు తూర్పు చైనా ప్రాంతంలోని మంగోలియా పరిధిలో అనుమానిత బుబోనిక్ ప్లేగు కేసులు రెండు వచ్చాయని స్థానిక హెల్త్ కమిషన్ వెబ్ సైట్ పేర్కొంది. మర్మోట్ (ఉడ‌త జాతి)కి చెందిన మాంసాన్ని తిన‌డం వ‌ల్ల వీరికి ఈ వ్యాధి వచ్చినట్టు గుర్తించారు. దీంతో వారితో సన్నిహితంగా మెలిగిన వారిని ఐసోలేట్ చేశారు. ఈ వ్యాధి మానవుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

బుబోనిక్ ప్లేగు అనేది ఓ బ్యాక్టీరియా వ్యాధి.  ఎలుక, ఉడ‌త‌లు లాంటి జీవుల‌పై ఉండే ఈగ‌ల వ‌ల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్య‌క్తి .. స‌రైన స‌మ‌యంలో చికిత్స చేయ‌కుంటే.. కేవ‌లం 24 గంట‌ల్లోనే ప్రాణాల‌ను వ‌దిలేస్తాడు.   గ‌త ఏడాది మంగోలియాలోని బ‌యాన్ ప్రావిన్సులో నాటు ఎలుక‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఓ జంట చ‌నిపోయింది. 


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/