రాష్ట్ర ప్రతిభను గుర్తిస్తూ ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్

హైదరాబాద్: రౌండ్ టేబుల్ ఇండియా ‘‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్’’ నాల్గవ ఎడిషన్ ను అందజేస్తుంది. తెలంగాణకు చెందిన వర్ధమాన వ్యక్తులను గౌరవించే, సత్కరించే ఒక విశిష్ట కార్యక్రమం ఇది. రౌండ్ టేబుల్ ఇండియా తమ తమ రంగాలలో కృషి, ఆవిష్కరణలతో రాష్ట్రం గర్వించేలా చేసిన డైనమిక్ హీ రోలను గుర్తించి సత్కరిస్తుంది. వారు తమ అద్భుతమైన ఆవిష్కరణలతో మన సమాజాన్ని అభివృద్ధి చేశారు. ఈ సంవత్సరం, 12 అవార్డుల కేటగిరీలు: కళలు మరియు సంస్కృతి, విద్య, వినోదం, ఆహారం మరియు పానీయాలు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ఎన్జీఓ, రిటైల్, ఎస్ఎంఇ, క్రీడలు, స్టార్ ఉమెన్ & స్టార్ట్-అప్‌లు. ప్రతి కేటగిరీలో ఇద్దరు విజేతలు ఉంటారు – ఒకరు తమ రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధిం చిన & యువతకు స్ఫూర్తిగా నిలిచిన విజేత (అచీవర్); మరొకరు ఆశాజనక ప్రతిభ కలిగిన  వర్ధమాన (ఎమర్జింగ్ ) సాధకులు మరియు తమ రంగంలో గణనీయ కృషి చేసిన వారు. విజేతలను జ్యూరీ  నిర్ణయిస్తుంది మరియు ఎమర్జింగ్ నామినేషన్‌లను షార్ట్‌ లిస్ట్ చేస్తుంది. ఎమర్జింగ్ కేట గిరీ నామినేషన్లకు రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తారు. సమాజంలో రాణించి మైలురాయిని సృష్టించిన విభిన్న నేప థ్యాల అనుభవజ్ఞులతో కూడిన జ్యూరీని కలిగి ఉన్నందుకు మేం సంతోషిస్తున్నాం, వారికి మా  కృతజ్ఞతలు.

ఈ ఏడాది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ జ్యూరీ సభ్యులు:

 1. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్
 2. శ్రీ మురళీ మోహన్, నటుడు, రాజకీయవేత్త, వ్యవస్థాపకులు – జయభేరి
 3.  శ్రీమతి శిల్పా రెడ్డి, మిసెస్ ఇండియా, ఫ్యాషన్ డిజైనర్, వ్యాపారవేత్త
  4.    శ్రీ సందీప్ అగర్వాల్, డైరెక్టర్, రత్నదీప్
  5.    డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్, ఫౌండర్, ఫెర్నాండెజ్ హాస్పిటల్స్
 4.    శ్రీవిద్యా రెడ్డి గుణంపల్లి, వైస్ చైర్‌పర్సన్, నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. గ్రాండ్ అవార్డుల వేడుక జూలై 2, 2023న జరగనుంది.
  గత మూడు ఎడిషన్లలో, ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ పన్నెండు వేర్వేరు విభాగాలలో వెయ్యి నామినేషన్ల ను అందుకుంది. నామినేషన్ ప్రక్రియ తర్వాత, సైట్ పబ్లిక్ ఓటింగ్‌కు తెరవబడింది. మేం అత్యధికంగా 53,000 ఓట్లను పొందాం. ప్రతి పన్నెండు కేటగిరీలలో ఒక విజేతకు ఓటు వేసే అవకాశం ప్రజలకు ఉంటుం ది. ఈ ఆకట్టుకునే గణాంకాలు అవార్డుల పట్ల అపారమైన ఆసక్తిని, ఎంగేజ్ మెంట్ ను తెలియజేస్తాయి. స మాజం నుండి అటువంటి చురుకైన భాగస్వామ్యాన్ని చూసి మేం సంతోషిస్తున్నాం. మా రాబోయే అవార్డు ల ప్రదానోత్సవం ద్వారా తెలంగాణలోని వ్యక్తులు, సంస్థల అత్యుత్తమ కృషిని గుర్తించడం కొనసాగించడాని కి మేం సంతోషిస్తున్నాం. రౌండ్ టేబుల్ ఇండియా ఎల్లప్పుడూ విద్య అనేది గొప్ప సాధనమని, వ్యక్తులు వారి కలలను సాధించడం లో సహాయపడుతుంది అనే వాస్తవాన్ని నొక్కిచెబుతుంది. రౌండ్ టేబుల్ ఇండియా ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని అణగారిన వర్గాల వారి కోసం మౌలిక సదుపాయాలను నిర్మించడానికి అంది స్తుంది. మునుపటిలాగా, 2023 అవార్డుల కేటగిరీలు కూడా చాలా జాగ్రత్తగా, చక్కటి ఆలోచనా ప్రక్రియతో రూపొందించబడ్డాయి. తమ రంగాలలో ప్రఖ్యాతి చెందిన, వృద్ధిలోకి రాబోతున్న వ్యక్తులకు స్ఫూర్తినిచ్చేలా  పనిచేసే అచీవర్ అవా ర్డులపై ప్రఖ్యాత జ్యూరీ సభ్యులు నిర్ణయం తీసుకుంటారు. ఎమర్జింగ్ అవార్డ్  అనేది తమ సంబంధిత రంగాలలో యువ ప్రతిభావంతుల విజయాలు, కృషిని   గుర్తించడానికి ప్రయత్నిస్తుంది. అవార్డులను ఎవరు పొందుతారో నిర్ణయించడంలో జ్యూరీ సభ్యుల బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది. తమ  రంగాలలో వ్యక్తులు, సంస్థల కృషిని గుర్తించి, అభినందించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఈ వేడుక అందిస్తుంది. ఔత్సాహిక అభ్యర్థులు, తమ కేటగిరీలలో ప్రమాణాలను సంతృప్తి పరిచేవారు, అవార్డు కోసం దరఖాస్తు చే సుకోవచ్చు లేదా వారికి తెలిసిన అర్హులైన అభ్యర్థులను సిఫార్సు చేయవచ్చు. నామినేషన్లను ఆన్‌లైన్‌ లో www. prideoftelangana.com లో పూరించాలి లేదా తగిన సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో info@pride oftelangana.com కు 27 మే, 2023 లోపు మెయిల్ చేయాలి. ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమా చారం కోసం http://www.prideoftelangana.comని సందర్శించవచ్చు.
 5. ప్రమాణాలను సంతృప్తిపరిచే షార్ట్‌ లిస్ట్ చేయ బడిన నామినీల నుండి, జ్యూరీ సభ్యులు ప్రతి విభాగంలో టాప్ 3ని ఎంపిక చేస్తారు, వారిలో అత్యంత అర్హు లైన వారిని ఖరారు చేస్తారు. తెలంగాణా నివాసులంతా కూడా తమను తాము నామినేట్ చేసుకోవాల్సిందిగా లేదా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాల్సిందిగా రౌండ్ టేబుల్ ఇండి యా కోరుతోంది. ఆసక్తిగల వ్యక్తులు తమ విజయాలు, కృషిని తెలియజేయడానికి, తగిన గుర్తింపు పొందేం దుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు వెలుగులోకి రావడానికి, వారి విజ యాలను వేడుక చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ 2023 ప్రధాన స్పాన్సర్‌లు, రత్నదీప్ రిటైల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఫాల్కన్‌లకు కూడా మేం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రౌండ్ టేబుల్ గురించి రౌండ్ టేబుల్ అనేది అంతర్జాతీయంగా, 1927లో లూయిస్ మార్చేసిచే  ఇంగ్లాండ్ లోని నార్విచ్‌లో    స్థా పించబడిన స్నేహ సంస్థ. 8 మంది సభ్యులతో కూడిన చిన్న సమూహం నుండి, నేడు ఇది ప్రపంచంలోని ప్రతి మూలకు ప్రాతినిధ్యం వహించేలా 52 దేశాలలో 43,000 మంది సభ్యులకు పెరిగింది. నవంబర్ 14, 1962న జాన్ బార్టన్ ద్వారా మద్రాస్ రౌండ్ టేబుల్ నంబర్ 1 ఏర్పాటుతో రౌండ్ టేబుల్ 1957లో భారత దేశానికి వచ్చింది. గత నాలుగు దశాబ్దాలుగా అది 4,600+ సభ్యుల బలమైన సంఘంగా ఎదిగింది. రౌండ్ టేబుల్ ఇండియా (RTI) 124 నగరాలు, పట్టణాలలో దాదాపు 324 టేబుల్‌లను కలిగి ఉంది. వ్యాపార వేత్తలు, వ్యవస్థాపకులు, సాంకేతిక నిపుణులు, నిపుణులు, వ్యక్తిగత ఆందోళనలకు అతీతంగా సమాజం భా రీ అవసరాలను తీర్చగలవారు, సేవలందించగల వారు ఇందులో ఉన్నారు. 1997 నుండి RTI, “విద్య ద్వా రా స్వేచ్ఛ” కింద, 3347 స్కూల్ ప్రాజెక్ట్‌ లలో రూ.380 కోట్లకు పైగా ఖర్చుతో 7900 తరగతి గదులను ని ర్మించింది, ఇది 87 లక్షలకు పైగా పిల్లల విద్యపై ప్రభావం చూపింది. పరిపాలనా రంగంలో, రౌండ్ టేబుల్ ఇండియా చాలా చురుకైన జాతీయ బోర్డుని కలిగి ఉంది, ఇది అసోసి యేషన్ వ్యవహారాలకు మార్గనిర్దేశం చేస్తుంది. రౌండ్ టేబుల్ ఇండియా 18 ప్రాంతాలుగా విభజించబడింది, వీటిని నిర్వహించేందుకు ఎక్కడికక్కడ సొంత ఏరియా బోర్డు ఉంటుంది. రౌండ్ టేబుల్ ఇండియా అన్ని కార్యకలాపాలకు జాతీయ సెక్రటేరియట్ కేంద్రంగా ఉంటుంది, ఇది చెన్నైలో ఉంది. రౌండ్ టేబుల్ ఇండియా, జీరో ఓవర్ హెడ్స్ సంస్థ. అంటే, సేకరించిన ప్రతి రూపాయి నిధులు మన ధార్మిక లక్ష్యాల వైపు వెళ్తాయి. జాతీయ లక్ష్యం ‘బడుగు బలహీనవర్గాల కోసం పాఠశాలలను నిర్మించడం’‘. ‘