స్టేజ్ పైనే నువ్వా..నేనా అనే రేంజ్ లో తిట్టుకున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు -ఎమ్మెల్యే పోదెం వీరయ్య

పబ్లిక్ వేదిక సాక్షిగా ఎమ్మెల్యే రేగా కాంతారావు -ఎమ్మెల్యే పోదెం వీరయ్య లు ఒకరిపై ఒకరు తిట్ల దండకం అందుకున్నారు. దుమ్ముగూడెంలో మండలం లక్ష్మీనగరం గ్రామంలో తునికి ఆకుల పంపిణీ బోనస్ చెక్కుల పంపిణీలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. భద్రాచలంలో నెక్స్ట్ గెలవబోయేది తామే అంటూ స్టేజ్ పైన ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రసంగిస్తుండగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య అడ్డుకున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ ప్రచారం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం నడుస్తుండగానే అక్కడే కూర్చొని ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లేచి పక్కకు వెళ్లిపోయారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇద్దర్నీ విడిపించారు. ఈ గొడవ జరుగుతున్న టైంలోనే ఇరు నాయకుల అభిమానులు కూడా పెద్ద పెద్దగా వ్యతిరేక అనుకూల నినాదాలు చేశారు.