అమెజాన్ చేతికి ‘భగవంత్ కేసరి’ డిజిటల్ రైట్స్ ..?

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు సమాచారం. అఖండ , వీర సింహ రెడ్డి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన బాలకృష్ణ..ఇప్పుడు భగవంత్ కేసరి తో రాబోతున్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ యావత్ అభిమానులను , ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ టీజర్ తో ఒక్కసారిగా సినిమా ఫై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం తాలూకా డిజిటల్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. చివరికి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 18 కోట్లకు డీల్ కుదిరినట్టుగా టాక్ నడుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుందనే సంగతి తెలిసిందే. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.