ఆఫ్గనిస్తాన్‌లో బాంబుపేలుడు..7 మంది మృతి

 

ఆఫ్ఘనిస్తాన్: మరోసారి భారీ పేలుడుతో ఆఫ్ఘనిస్తాన్‌ వణికిపోయింది. మజార్‌ ఏ షరీఫ్‌ నగరంలో జరిగిన పేలుడులో 7 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. యాత్రికుల బస్సును టార్గెట్‌ చేస్తూ ఈ పేలుడు జరిగింది. ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి బస్సుతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/