ఏపీలో ‘ఆరు’ కు చేరిన ఓమిక్రాన్

two-hundred-omicron-cases-reported-in-india-so-far

ఏపీలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు ఆరుకు చేరాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధరణ అయింది. 19 వ తేదీ నమునా సేకరించి పరీక్షలకు పంపించగా… ఒమిక్రాన్‌గా తేలింది. యూకే నుంచి అనంతపురం వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది.

తూర్పు గోదావరి కోనసీమ అయినవెల్లి మండలం నేదునూరిపాలెనికి చెందిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవలే ఈ మహిళ కువైట్‌ నుంచి వచ్చింది. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ​వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య ఆరుకు చేరింది. బాధితుల కుటుంబసభ్యులకు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రానికి విదేశాల నుంచి 67 మంది వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చినవారిలో 12 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు తెలిపింది.