విశాఖ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. 3 గంటలు ఆలస్యంగా వందేభారత్

ఈ మధ్య వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒడిశా లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో దాదాపు 270 కి పైగా ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా దిగ్బ్రాంతి కి గురి చేసింది. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు గూడ్స్ రైళ్లు ప్రమాదాలకు గురి అయ్యాయి. తాజాగా విశాఖ సమీపంలో అనకాపల్లి-తాడి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం తెల్లవారుజామున 3.35 గంటలకు గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది.

ఈ ప్రమాదం వల్ల రైల్వే అధికారులు ఈ రూట్ లో నడిచే పలు రైళ్లను రద్దు చేసింది. వీటిలో జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నాయి. ఇక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. విశాఖ నుంచి ఉదయం 5.45కి బయల్దేరాల్సిన వందేభారత్‌.. 8.45కి బయల్దేరింది. మరికొన్ని రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్‌కు మరమ్మత్తులు చేపట్టారు.