రమణకు గులాబీ కండువా కప్పిన కెసిఆర్

ర‌మ‌ణ‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు టీఆర్ఎస్ లో చేరిక

KCR invited Ramana to the party
KCR invited Ramana to the party

Hyderabad: సీఎం కేసీఆర్ తెలంగాణ టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ఎల్ రమణకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ర‌మ‌ణ‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా టీఆర్ఎస్ లోకి వచ్చారు. . ఇటీవ‌లే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసిందే. గన్‌పార్క్‌ వద్ద అమరులకు నివాళులర్పించిన రమణ..అమరుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని అన్నారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/