RRR సీన్‌తో టీ కాంగ్రెస్‌ ప్రచారం..మాములుగా లేదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 30 న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 03 న ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఈసారి సోషల్ మీడియా ను సైతం గట్టిగా వాడుకోవాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు ఇప్పటికే ఆ ప్రచారం మొదలుపెట్టి ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈసారి ప్రచారంలో సినిమా సీన్లను కాంగ్రెస్ పార్టీ బాగా వాడుకుంటుంది.

ఆస్కార్ బరిలో నిలిచి తెలుగు సినిమా సత్తా ను చాటిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ సీన్ ను తాజాగా కాంగ్రెస్ వాడుకుంది. ఎన్టీఆర్ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఫేస్ క్రియేట్ చేసి ఓ ఎడిట్ వీడియో ను కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. ‘వస్తున్నా… దొర గడీలో బందీ అయిన తెలంగాణను రక్షించడానికి.. అంటూ ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్లు పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకం గురించి పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.