చిరు-రవితేజ సాంగ్ షూట్ పూర్తి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాస్ రాజా రవితేజ ఓ కీలక రోల్ చేస్తున్నాడు. అంతే కాదు చిరంజీవి – రవితేజ లు కలిసి ఓ సాంగ్ లో చిందులేస్తున్నారు. దీనికి సంబదించిన షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. భారీ సెట్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ అభిమానులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

వారిద్దరూ కలిసి..ఎలా డ్యాన్స్ చేశారోననే ఉత్కంఠలో అభిమానులున్నారు. రీసెంట్ గా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ అభిమానుల్లో ఆసక్తి , అంచనాలు పెంచింది. టీజర్ లో చిరంజీవి మరోసారి పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. పూల చొక్కా, లుంగీ, చెవికి రింగ్, దమ్ము కొడుతూ మాస్ గా కనిపించాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తుండగా , శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.