చంద్రబాబు అరెస్ట్ ఫై జూ.ఎన్టీఆర్ స్పందించకపోవడం వెనుక కారణం అదే – రాజీవ్ కనకాల

స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో అరెస్ట్ అయ్యి జైలు లో ఉన్న చంద్రబాబు కు జూ.ఎన్టీఆర్ సంఘీభావం తెలుపక పోవడం , కనీసం అరెస్ట్ ను ఖండించకపోవడం ఫై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ను అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని , బెయిల్ కూడా రాకుండా చేస్తుందని..ఇంత చూస్తూ కూడా ఎన్టీఆర్ ఒక్కసారైనా స్పందకపోవడం దారుణమని అంత ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలో ఎన్టీఆర్ స్నేహితుడు రాజీవ్ కనకాల ఎన్టీఆర్ స్పందించకపోవడం ఫై క్లారిటీ ఇచ్చారు. తారక్ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదనుకుంటా అంటూ నటుడు రాజీవ్ కనకాల వ్యాఖ్యనించారు. ఈ విషయం స్వయంగా ఎన్టీఆర్ రాజీవ్ తో పంచుకున్నారా లేదా తన అభిప్రాయాన్ని చెప్పారా అన్నది తెలియాల్సి ఉంది.