చంద్రబాబు కు ముందస్తు బెయిల్ మంజూరు

అంగళ్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు పూర్తి కావటంతో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. లక్ష రూపాయలు పూచికత్తు, ఇద్దరు షూరిటీతో బెయిల్ ను ఇచ్చింది. ఇప్పటికే అంగళ్ళుకేసులో 79మందికి ముందస్తు బెయిల్ లభించింది.

ఆగస్టు 4న అంగల్లు మీదుగా చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ సమయంలో జరిగిన ఘర్షణల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో చంద్రబాబుతో సహా 179 మంది పైన కేసులు నమోదయ్యాయి. దీని పైన పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా విచారణ తరువాత కొందరికి బెయిల్ మంజూరు అయింది. ఇప్పుడు స్కిల్ స్కాంలో రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. కొందరు చంద్రబాబు పైనే రాళ్లు రువ్వారని వాదనల్లో కోర్టుకు వివరించారు. చంద్రబాబు కు రక్షణగా ఉన్న ఎన్ఎస్జీ సిబ్బంది కాపాడారని చెప్పుకొచ్చారు. ఈ పిటీషన్ పై వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసారు.