సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేత తమిళనాడు

బడోడాపై 7 వికెట్ల తేడాతో గెలుపు

Tamil Nadu Team
Tamil Nadu Team

Ahmedabad : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని తమిళనాడు గెలుచుకుంది. దేశవాళీ జాతీయ టి20 టోర్నీ అయిన ఈ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరులో తమిళనాడు 7 వికెట్ల తేడాతో బరోడాపై విజయం సాధించింది. తొలుత బరోడాను 120 పరుగులకు పరిమితం చేసిన తమిళనాడు లక్ష్యాన్ని రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. నాలుగు వికెట్లు కూల్చి తమిళనాడు విజయంలో ముఖ్యపాత్ర పోషించిన మణిమారన్‌ సిద్దార్ధ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

లక్ష్య ఛేదనలో తమిళనాడు ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. జగదీశన్‌ 14 పరుగులు చేసి వెనుతిరిగిన తరువాత నిశాంత్‌, బాబా అపరాజిత్‌ స్కోరును ముందుకు నడిపించి రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించి పటిష్ట స్థితికి చేర్చారు. నిశాంత్‌ 35 పరుగులకు నిష్క్రమించాడు. ఆపై బాబా అపరాజిత్‌(29 నాటౌట్‌), కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌(22), షారుఖ్‌ ఖాన్‌(18 నాటౌట్‌) జట్టును విజయ తీరాలకు చేర్చారు.

తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన బరోడా ఆరంభంనుంచి వికెట్లను కోల్పోయింది. నినద్‌ రాథ్వా ఒకే పరుగుకు పెవిలియన్‌ చేరగా, కెప్టెన్‌ కేదార్‌, సోలంకి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ బాబా అపరాజిత్‌ కేదార్‌ను అవ్ఞట్‌చేసి వారి ప్రయత్నాలను వమ్ము చేశాడు. ఆపై బరోడా 14 పరుగులు తేడాతో అయిదు వికెట్లు కోల్పోయి ఇక్కట్లలో పడింది. ఈ తరుణంలో సోలంకి, అతీత్‌ సేథ్‌ ఏడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యంతో గట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. అతీత్‌ సేత్‌ 29 పరుగులకు సోను యాదవ్‌ బౌలంగ్‌లో అవ్ఞటవడంతో బరోడా మరోసారి కుదుపుకు గురయింది. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సోలంకి ఒక పరుగు తేడాతో ఆ అవకాశం కోల్పోయాడు. 49 పరుగులకు రనౌటై వెనుతిరిగాడు. ఆపై బరోడా ఇన్నింగ్స్‌ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు.

స్కోర్‌బోర్డ్‌ : బరోడా ఇన్నింగ్స్‌ –

కేదార్‌ దేవధర్‌ సి జగదీశన్‌ బి మణిమారన్‌ సిద్దార్ధ్‌ 16, నినద్‌ రాథ్వా సి అరుణ్‌ కార్తీక్‌ బి అపరాజిత్‌ 1, సోలంకి రనౌట్‌ 49, స్మిత్‌ పటేల్‌ ఎల్బీ మణిమారన్‌ సిద్దార్ధ్‌ 1, భాను పనియా రనౌట్‌ 0, అభిమన్యు రాజ్‌పుత్‌ సి అండ్‌ బి మణిమారన్‌ సిద్దార్ధ్‌ 2, కార్తీక్‌ కకడె బి మణిమారన్‌ సిద్దార్ధ్‌ 4, అతీత్‌ సేథ్‌ సి అరుణ్‌ కార్తీక్‌ బి సోను యాదవ్‌ 29, భార్గవ్‌ భట్‌ నాటౌట్‌ 12, బి.పఠాన్‌ సి కార్తీక్‌ బి మొహమ్మద్‌ 0, ఎక్‌ట్రాలు 6, మొత్తం(20 ఓవర్లలో 9 వికెట్లకు)120.
వికెట్ల పతనం : 1-6, 2-22, 3-28, 4-28, 5-32, 6-36, 7-94, 8-120, 9-120.
బౌలింగ్‌ : శాయి కిషోర్‌ 4-1-11-0; అపరాజిత్‌ 3-0-16-1; మణిమారన్‌ సిద్దార్ధ్‌ 4-0-20-4; మురుగన్‌ అశ్విన్‌ 4-0-27-0; సోను యాదవ్‌ 3-0-29-1; మొహమ్మద్‌ 2-0-16-1.

తమిళనాడు ఇన్నింగ్స్‌ –

హరి నిశాంత్‌ సి భార్గవ్‌ భట్‌ బి పఠాన్‌ 35, ఎన్‌.జగదీశన్‌ సి కార్తీక్‌ కకడె బి లక్మన్‌ మెరివాలా 14, బాబా అపరాజిత్‌ నాటౌట్‌ 29, దినేష్‌ కార్తీక్‌ సి సోలంకి బి అతీత్‌ సేథ్‌ 22, షారూఖ్‌ ఖాన్‌ నాటౌట్‌ 18, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం(18 ఓవర్లలో 3 వికెట్లకు)123.
వికెట్ల పతనం : 1-26, 2-67, 3-101.
బౌలింగ్‌ : అతీత్‌ సేథ్‌ 3-0-20-1; లక్మన్‌ మెరివాలా 4-0-34-1; భార్గవ్‌ భట్‌ 4-0-25-0; కార్తీక్‌ కకడె 2-0-12-0; భబాషఫి పఠాన్‌ 4-0-23-1; నినద్‌ రాథ్వా 1-0-8-0.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/