5 నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్‌

జెనీవా: స్విట్జర్లాండ్‌లో ఐదు నుంచి 11 ఏండ్లలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమయింది. ఫైజర్‌ బయోఎన్‌టెక్‌ తయారుచేసిన కమిర్నాటీ వ్యాక్సిన్‌ను చిన్నారులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి స్విట్జర్లాండ్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ స్విస్‌మెడిక్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏజ్‌ గ్రూప్‌వారికి టీకాలు ఇస్తున్న దేశాల జాబితాలో స్విట్జర్లాండ్‌ కూడా చేరినట్లయింది. ఇప్పటికే పోర్చుగల్‌, ఇటలీ, గ్రీస్‌, స్పెయిన్‌, కెనడా, అమెరికా దేశాలు ఈ ఏజ్‌ గ్రూప్‌ చిన్నారుల్లో వ్యాక్సినేషన్‌కు అనుమతించాయి.

క్లినికల్‌ ట్రయల్స్‌ ద్వారా ఐదు నుంచి 11 ఏండ్ల మధ్య వయస్సు కలిగిన చిన్నారులకు టీకా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడైందని స్విస్‌మెడిసిస్‌ వెల్లడించింది. దీంతో చిన్నారులకు మూడు వారాల వ్యవధిలో కమిర్నాటి టీకాను రెండు డోసులను పంపిణీ చేస్తామని చెప్పింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పెద్దవారిలో కంటే తక్కువగా సైడ్‌ ఎఫెక్టులు ఉంటాయిని తెలిపింది. వాటిలో టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని పేర్కొన్నది. దేశంలో ప్రస్తుతం 12 ఏండ్ల పైబడినవారికి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నారు. స్విట్జర్లాండ్ ప్రస్తుతం కరోనా ఐదో వేవ్‌ కొనసాగుతున్నది. దేశంలో కొమిర్నటీ, మోడెర్నా వ్యాక్సిన్లను మాత్రమే అనుమతిస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/