నేటి నుండి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు

రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుండి 21రోజులపాటు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న వేడుకలను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

నేటి నుండి 21 రోజుల పాటు ప్రతి రోజూ ఒక కార్యక్రమం చొప్పున దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. జూన్‌ 3న రైతు దినోత్సవం, 4న పోలీసు శాఖ సురక్షా దినోత్సవం, 5న విద్యుత్‌ విజయోత్సవం, సింగరేణి సంబురాలు, 6న పారిశ్రామిక ఉత్సవం, ఇండస్ట్రియల్‌ ఐటీ కారిడార్లలో సభలు, 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబురాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్యారోగ్య దినోత్సవం, 15న పల్లెప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజనోత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20 విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న అమరులకు నివాళి, స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి.