హెలికాప్టర్ ఘటన..లాన్స్ నాయక్ సాయితేజ సహా ఆరుగురి మృతదేహాల గుర్తింపు

స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
మిగిలిన వారి మృతదేహాల గుర్తింపు పనిలో అధికారులు

న్యూఢిల్లీ : హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన వారిలో మరో ఆరుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిలో చిత్తూరు జిల్లా ఎగవరేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతిక కాయం కూడా ఉన్నట్టు సైన్యం తెలిపింది. అలాగే, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను కూడా గుర్తించారు. మిగిలిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు సైన్యాధికారులు తెలిపారు. కాగా, గుర్తించిన వారి మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించి సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/