కొవిడ్‌ నిబంధనలను ఉల్లఘించిన ట్రంప్‌

ఇండోర్ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌

trump

నెవాడా: అమెరికా అధ్యక్ష న్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్ తొలి ఇండోర్ ర్యాలీలో పాల్గొన్నారు. నెవాడాలో జరిగిన బహిరంగ సభలో ట్రంప్‌ కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. వేల సంఖ్యలో పాల్గొన్న ఈ సమావేశంలో ట్రంప్ తోపాటు చాలా మంది ముఖాలకు మాస్కులు ధరించకుండా హాజరయ్యారు. ర్యాలీ జరిగిన ప్రదేశంలో భౌతిక దూరాన్ని అనుసరించే ప్రయత్నమేదీ ట్రంప్ మద్ధతుదారుల్లో కనిపించలేదు. ట్రంప్ ప్రచార నినాదాలతో టోపీలు ధరించిన మద్దతుదారులు మడత కుర్చీలపై కూర్చున్నారు.

తొలి ఇండోర్ ర్యాలీ నెవాడాలోని స్టేడియంలో జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ట్రంప్ మద్దతుదారులు, రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన నిబంధనలను తోసిరాజని సమావేశం జరుగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమావేశానికి హాజరైనవారిలో మూడో వంతు ప్రజలు ముఖాలకు మాస్కులు ధరించలేదు. కనీసం భౌతిక దూరం నిబంధనను కూడా మరిచిపోయి ఎగబడ్డారు. ర్యాలీకి హాజరు కావడానికి ప్లాంట్ లోపల స్థలం లేకపోవడంతో చాలా మంది బయట నిలబడి కనిపించారు. వీరిలో కొందరు చిన్న పిల్లలను వారితో తీసుకువచ్చారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/