బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు ఫ్యామిలీ స్పందన

వీరసింహ రెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబ సభ్యులు , అభిమానులు , ఎస్వీ రంగారావు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత సినిమాలకు సంబంధించిన విషయాల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. అక్కినేని.. ‘తొక్కినేని’ అని , ఆ రంగారావు , ఈ రంగారావు అంటూ ఏదో ఫ్లో లలో మాట్లాడారు. దీంతో బాలయ్య వ్యాఖ్యల ఫై సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే అక్కినేని హీరోలు నాగ చైతన్య , అఖిల్ బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా ఎస్వీ రంగారావు ఫ్యామిలీ సభ్యులు ఈ ఇష్యూ ఫై స్పందించారు.

ఎస్వీఆర్ కుటుంబానికి బాలకృష్ణ కు మధ్య మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. తామంతా ఒకే కుటుంబంగా ఉంటామని పేర్కొన్నారు. తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన చాలా జనరల్ గా చెప్పారని వివరించారు. ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించ లేదని ఎస్వీఆర్ మనవళ్లు రంగారావు, ఎస్ వి ఎల్ ఎస్ రంగారావు చెప్పుకొచ్చారు. ఇక, ఈ విషయాన్ని ఇంకా డ్రాగ్ చేయవద్దని కోరారు. ఇందులో వివాదాన్ని తీసుకొచ్చి తమకు..తమ కుటుంబ సభ్యులకు..నందమూరి వంశానికి..నందమూరి వారసులకు ఉండే అనుబంధాన్ని ఇబ్బంది పెట్టొద్దని అందరి అభిమానులకు లేఖ ద్వారా సూచించారు. ఇక ఈ వివాదం పైన ఇప్పటివరకు బాలయ్య స్పందించ లేదు.