మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

కొన్నాళ్ల క్రితం విజయవాడలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన దొంగల ముఠా చెడ్డీగ్యాంగ్..గత కొద్దీ రోజులుగా వార్తల్లో లేకుండా ఉన్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బోబత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి మియాపూర్లోని వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి..ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు.

అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. స్కూల్‌లోని సీసీటీవీలో వారు దోచుకుంటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. స్కూలు యాజమాన్యం ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెడ్డీగ్యాంగ్ ముఠా హైదరాబాద్‌లో దిగిందన్న వార్తతో మియాపూర్ పరిసర ప్రాంత వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.