ఉరి తప్పించాలని చివరిదాకా ప్రయత్నం
అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ధర్మాసనం తలుపు తట్టిన నిర్భయ దోషుల లాయర్

Delhi: నిర్భయ దోషులను ఉరి శిక్ష నుంచి కాపాడటానికి వారి తరఫు లాయర్ ఏపీ సింగ్ చివరి ప్రయత్నమూ విఫలమైంది.
ఉరికి ముందు కూడా ఆఖరి ప్రయత్నంగా వీరిని విడిపించేందుకు దోషుల తరపు లాయర్ ఏపీ. సింగ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ధర్మాసనం తలుపు తట్టాడు.
అయితే ఏపీ సింగ్ చెప్పిన ఏ విషయాన్ని కూడా అంగీకరించని కోర్టు చివరకు ఉరిశిక్ష ఖరారు చేయాలని చెప్పింది.
ఇక ఉరిశిక్ష అమలు జరిగిన నలుగురు దోషులు కూడా ఉరికి మందు రోజు రాత్రి వింతగా ప్రవర్తించారు. వినయ్ శర్మ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. ఇక పవన్ గుప్తా జైలు అధికారులను దూషించాడని చెబుతున్నారు.
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/