ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర!

కేంద్ర ప్రభుత్వం సమ్మతి

New Delhi: దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ)గా సుశీల్‌ చంద్ర నియామకం కానున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి ప్రస్తుతం సుశీల్‌ చంద్రను సీఈసీగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు జారీ కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత సీఈసీ సునీల్‌ అరోడా పదవీ కాలం ఈ నెల 12తో ముగియనుంది. ఆయన స్థానంలో సుశీల్‌ ఈ నెల 13న పదవీ బాధ్యతలు చేపడతారు. వచ్చే ఏడాది మే 14 తేదీ వరకు ఆయన కొనసాగుతారు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/