ఏజెంట్ కోసం దిగుతున్న ఎన్టీఆర్ పెద్దనాన్న!

ఏజెంట్ కోసం దిగుతున్న ఎన్టీఆర్ పెద్దనాన్న!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తో్న్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా తరువాత అఖిల్ తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాకు ఏజెంట్ అనే స్టైలిష్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమా కోసం అఖిల్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఇటీవల అఖిల్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక పూర్తి స్పై థ్రిల్లర్‌గా ఈ మూవీ వస్తుండటంతో ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఏజెంట్ కోసం దిగుతున్న ఎన్టీఆర్ పెద్దనాన్న!

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’లో కీలక పాత్రలో మోహన్ లాల్ నటించి మెప్పించారు. ఇప్పుడు అఖిల్ కోసం మరోసారి మోహన్ లాల్ తెలుగులో నేరుగా నటించబోతుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.