100 కోట్లకు చేరువలో వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తరువాత వకీల్ సాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, తొలిరోజే అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుని తన సత్తా చాటింది.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అఫీషియల్ లెక్కలు రావాల్సి ఉన్నా, ఈ సినిమా సోమవారం నాటికి దాదాపుగా రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందని తెలుస్తోంది. ఇక షేర్ వసూళ్ల పరంగా ఈ సినిమా రూ.60 కోట్ల వరకు సాధించిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. దీంతో సోమవారం నాడు ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

పవన్ కళ్యాణ్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌ ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవగా, ఈ సినిమాలో నివేధా థామస్, అంజలి, అనన్యాల నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇక థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మరి సోమవారం నుండి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.