రవితేజ సినిమా డబ్బింగ్ పూర్తి చేసిన అక్కినేని హీరో

అక్కినేని హీరో సుశాంత్..ఆలా వైకుంఠపురం మూవీ తో మళ్లీ లైన్లోకి వచ్చాడు. హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాల్లో కూడా కీలక పాత్రలు చేసేందుకు ఉత్సాహం కనపరుస్తుండడం తో డైరెక్టర్స్ వరుస ఛాన్సులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఈయన…రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర మూవీ లో కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ పాత్ర తాలూకా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి కావడం తో వెంటనే డబ్బింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరీయా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అలాగే ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపించబోతుండగా.. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్, ఆర్జి టీం వర్క్స్ బ్యానర్స్ పై సినిమా నిర్మితమవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్, బీమ్స్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఏప్రిల్ 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.