సంక్రాంతి పండగ దృష్టిలో పెట్టుకొని వాహనాదారులకు పోలీసుల హెచ్చరికలు

ఏపీలో సంక్రాంతి పండగ సంబరాలు మొదలయ్యాయి..ఎక్కడెక్కడో ఉన్న వారంతా సొంతర్లకు వచ్చేస్తున్నారు. ఇక హైదరాబాద్ గురించి చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి వచ్చిందంటే సగం ఖాళీ అవుతుంది. ఈరోజు నుండి స్కూల్స్ కు సెలవులు ప్రకటించడం తో నిన్నటి నుండి నగర వాసులు పల్లె బాట పట్టారు. దీంతో విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి ఫై రద్దీ మొదలైంది.

సంక్రాంతి పండుగ సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రం నుంచి జాతీయ రహదారిపై రక్షణ చర్యలు చేపట్టారు పోలీసులు. ఆంధ్రాప్రాంతానికి వెళ్లే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. అతివేగంతో వాహనాలు నడపరాదని.. నిద్ర మత్తులో వాహనాలు నడకూడదని సూచించారు. దూర ప్రయాణం వల్ల అలసిపోవడం, నిద్ర మత్తు కారణంగా ప్రమాదాలకు జరిగే అవకాశం ఉన్నది తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ కోరారు.

వాహనాలు కండిషన్ లో ఉండాలి. చలి ప్రభావం, పొగమంచు ఉంటుంది. రాత్రి కావున ప్రయాణంలో డ్రైవర్ అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. అత్యవసర సమయంలో రహదారుల అధికారులను లేదా డయల్ 100 కు పొన్ చేసి సహాయం తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రక్కన అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపవద్దు అని విజ్ఞప్తి చేశారు.