పందెం కోడి ని వేలం వేయబోతున్న TSRTC

నాల్గు రోజుల క్రితం కరీంనగర్ బస్సులో ప్రయాణికుడు పందెం కోడిని మరచిపోయాడు. దీంతో ఆర్టీసీ సిబ్బంది డిపోకు తీసుకెళ్లి..జాగ్రత్తగా చూసుకున్నారు. తిరిగి సదరు ప్రయాణికుడు వచ్చి తన కోడి ని తీసుకొని వెళ్తాడని అధికారులు భావించినప్పటికీ ఎవ్వరు రాలేదు. దీంతో అధికారాలు ఈరోజు మధ్యాహ్నం ఈ కోడ్ని వేలం పాట పెట్టబోతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ డిపో-2 ఆవరణలో వేలం వేయనున్నారు.

నిబంధనల ప్రకారం లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్‌ మల్లయ్య తెలిపారు. పందెం కోడి కోసం ఎవరూ రాకపోవడంతో శుక్రవారం వేలం వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు పాల్గొనవచ్చని సూచించారు. వచ్చిన మొత్తాన్ని ట్రెజరీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని తెలిపారు. ఇక ఏ కోడి బరువు దాదాపు 6 కేజీల వరకు ఉంటుందని అంటున్నారు.