నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట్లో విషాదం

హారిక హాసిని నిర్మాణ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ ఇంట విషాదం చోటుచేసుకుంది. రాధాకృష్ణ తల్లి నాగేంద్రమ్మ(90) కన్నుమూసారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హృదయ సంబంధిత వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కాగా, సూర్యదేవర నాగేంద్రమ్మ కు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ రెండో కుమారుడు కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఆమె నాయనమ్మ అవుతారు. రేపు(మే 31) ఉదయం పది గంటలకు ఫిల్మ్ నగర్‌లోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సూర్యదేవర నాగవంశీ నిర్మించిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ సమయంలోనే వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాలకు, సీరియల్స్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. వారు అనేక సూపర్ హిట్ సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. సితారా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నాగవంశీ సినిమాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో నాగ్ వంశీ బిజీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో వారింట విషాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు చినబాబు చాల క్లోజ్. ఇద్దరు కలిసే సినిమాలు చేస్తూ వస్తున్నారు.