గోద్రెజ్ మై ఫార్మ్‌ను ఆవిష్కరించిన క్రీమ్‌లైన్ డైరీ ప్రోడక్ట్స్

గోద్రెజ్‌కి చెందిన ఫార్మ్ నుంచి నేరుగా వినియోగదారుల ఇంటి ముంగిట్లోకే తాజా పాలు..కొనుగోలుదారుల పాల వినియోగ ధోరణులపై మిల్క్ రిపోర్ట్ ఆవిష్కరణ..

Creamline Dairy Products launched Godrej My Farm

హైదరాబాద్: భారతదేశపు డైవర్సిఫైడ్ అగ్రి బిజినెస్ దిగ్గజం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ (జీఏవీఎల్) అనుబంధ సంస్థయిన క్రీమ్‌లైన్ డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ (సీడీపీఎల్) నేరుగా గోద్రెజ్ వ్యవసాయ క్షేత్రం నుంచి వినియోగదారుల ఇంటి ముంగిట్లోకి తాజా పాలు అందించేలా గోద్రెజ్ మై ఫార్మ్ (Godrej My Farm) పాలను ఆవిష్కరించింది. గోద్రెజ్ మై ఫార్మ్ పాలు నేరుగా గోద్రెజ్‌ స్వంత ఫార్మ్ నుంచి సోర్స్ చేయబడి, పాశ్చరైజ్ చేయబడి, అదునాతన టెక్నాలజీతో ప్యాక్ చేయడం వల్ల సహజసిద్ధమైన రుచి, పోషక విలువలను కోల్పోకుండా తాజాగా ఉంటాయి. హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ పాలను, తీయడం నుంచి వినియోగదారులకు చేర్చే వరకు ప్రక్రియ అంతా ఆటోమేటెడ్‌గా, మనిషి చేయి తగలని విధంగా ఉంటుంది. ఫీడింగ్ నుంచి బ్రీడింగ్ వరకు సరఫరా వ్యవస్థ అంతా సింగిల్ పాయింట్ నుంచి నియంత్రించబడుతుంది.

భారతీయ వినియోగదారులు నేడు తమ ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నారు. తమకు, తమ కుటుంబం కోసం అత్యుత్తమమైనవి ఎంచుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ‘బాటమ్స్ అప్ … ఇండియా సేస్ చీర్స్ టు మిల్క్’ (‘Bottoms Up…India Says Cheers to Milk’) పేరిట రూపొందించిన మిల్క్ రిపోర్టులోను ఇవే అంశాలు వెల్లడయ్యాయి. ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు, పాలు కొనుగోలు చేసేటప్పుడు కల్తీ జరగలేదనే భరోసాతో పాటు పరిశుభ్రమైన సోర్సింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.

“పాల ఉత్పత్తి, పంపిణీ విషయాల్లో గోద్రెజ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆవుల బాగోగులు బట్టి పాల నాణ్యత ఆధారపడి ఉంటుంది కాబట్టి మేము 1,400 పైచిలుకు ఆవులకు సంబంధించి వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటాం. క్రమం తప్పకుండా వాటి ఆహారం, ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంటాం. దీనికి మా అధునాతన ప్రాసెసింగ్ ప్లాంటు, సంపూర్ణంగా నియంత్రిత సప్లై చెయిన్ కూడా తోడు కావడం వల్ల పౌష్టికమైన, ఎవరి చేయి తాకని, తాజా పాలను అందించగలుగుతున్నాం. పాలిచ్చిన ఆవు నుంచి ప్యాకేజింగ్ వరకూ అన్ని అంశాలను ట్రేస్ చేయగలిగే విధానం వల్ల భద్రత విషయంలోనూ భరోసా ఉండగలదు. దీనితో వినియోగదారులు తమ పెరట్లోని ఆవు ఇచ్చిన పాల తరహాలోనే నాణ్యమైన గోద్రెజ్ మై ఫార్మ్ మిల్క్‌ను ఆస్వాదించవచ్చు” అని మై ఫార్మ్ మిల్క్ ఆవిష్కరణ సందర్భంగా గోద్రెజ్ జెర్సీ సీఈవో శ్రీ భూపేంద్ర సూరి తెలిపారు.

ఈ సందర్భంగా ఆవిష్కరించిన మిల్క్ రిపోర్టు ప్రకారం 55 శాతం మంది వినియోగదారులు అన్‌బ్రాండెడ్ పాలు అనారోగ్యకరమైనవిగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. అత్యంత నాణ్యమైన, సురక్షితమైన పాల కోసం అవసరమైతే మరింత ఎక్కువ చెల్లించేందుకు సిద్ధమని 90 శాతం మంది వినియోగదారులు తెలిపారు. స్వచ్ఛమైన, సురక్షితమైన పాల ఉత్పత్తులకు నెలకొన్న డిమాండ్‌ను ఈ నివేదిక పునరుద్ఘాటిస్తోంది.

గోద్రెజ్ మై ఫార్మ్ పాల ధర 500 మి.లీ.కు రూ. 50గా ఉంటుంది. ఇది 70+ ఆధునిక ట్రేడ్ స్టోర్స్‌తో పాటు జెప్టో, మిల్క్‌బాస్కెట్, BB డైలీ, FTH డైలీ వంటి ప్రముఖ క్విక్-కామర్స్ సంస్థల్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి హైదరాబాద్ నగరంలో 500+ ఆధునిక ట్రేడ్ స్టోర్స్‌లో వీటిని అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్దేశించుకుంది. నాణ్యత, పారదర్శకత, సాంకేతికతకు పెద్ద పీట వేయడం ద్వారా భారతదేశ డైరీ రంగాన్ని మరింత ఆరోగ్యకరమైనదిగా, చురుకైనదిగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించేందుకు GAVL కట్టుబడి ఉంది.