సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

ఏపీ ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానా విధించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దేవీ సీఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానా విధించింది. దేవి సీఫుడ్స్ కేసులో హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపును ఇవ్వాలని సుప్రీంను కోరింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను కొట్టేసింది. ప్రభుత్వానికి లక్ష రూపాయల జరిమానా విధించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/