క‌డ‌ప చేరుకున్న టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు

కడప: టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు నాయుడు క‌డ‌ప కు చేరుకున్నారు. నేటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం కడప, మధ్యాహ్నం తిరుపతి ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆయన పరామర్శించనున్నారు.

రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సాయం చేయాలని పార్టీ శ్రేణులను ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని కోరారు. చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల నుంచే చంద్రబాబు యాక్షన్‌ మొదలుకానుంది. ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉంటానని అసెంబ్లీలో శపథం చేసిన బాబు వరద ప్రభావిత జిల్లాల నుంచే జనంలోకి వెళ్లనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/