తెలంగాణ బీజేపీకి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్‌లు నియమించిన అధిష్టానం

తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా కాషాయం జెండా ఎగురవేయాలని చూస్తున్న బిజెపి..దానికి తగ్గట్లే ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఇతర పార్టీ నేతలపై దృష్టి సారించిన కేంద్రం..పలువుర్ని చేర్చుకోగా..ఇప్పుడు రాష్ట్రానికి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్‌లను నియమించింది. తరుణ్ చుగ్ ఇంఛార్జ్‌గా, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్‌గా నియమిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటన జారీ చేసింది.

మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్‌లను నియమించింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్‌ను హర్యానా ఇంఛార్జ్‌గా, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్‌గా నియమించింది. పశ్చిమబెంగాల్‌కు బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేను నియమించారు. ఇక జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రను ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేటర్‌గా నియమించారు.