రేవంత్ రెడ్డికి కొండా సురేఖ బహిరంగ లేఖ..

తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తప్పడం లేదు. వరుస పెట్టి నేతలు అధిష్టానానికి షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి వేరే పార్టీ లలో జాయిన్ కాగా..ఉన్న నేతలు కూడా పార్టీకి గుడ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా టీపీసీసీ కొత్త కమిటీలను అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. ఈ కమిటీ కూర్పుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో కొండా సురేఖ కూడా ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ.. ఏఐసీసీ వేసిన తెలంగాణ ప్రదేశ్ కమిటీలు నాకు అసంతృప్తిని కలిగించాయని తెలిపారు. తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ లో నా పేరు లేకపోవడం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఏ లీడర్ పేరు లేకపోవడం మనస్థాపం కలిగించిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ ప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ లో నాకంటే జూనియర్లను నామినేట్ చేశారని, నన్ను మాత్రం తెలంగాణ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా నియమించడం జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.

“టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో నన్ను వేయటం బాధ కలిగించింది. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో నా పేరు లేదు. పొలిటికల్ ఎఫైర్స్ నాకంటే జూనియర్లకు స్థానం ఇచ్చారు. ఇది నన్ను అవమానించటమే. అందుకే రాజీనామా చేశాను. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఒకసారి మంత్రిగా గెలిచాను. అయినా నా సీనియార్టీని గుర్తించకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో వేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో వేస్తే బాగుండేది. ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలవని వాళ్లను కూడా పొలిటికల్ ఎఫైర్స్‌లో పెట్టారు. ఇది నా స్థాయిని తగ్గించినట్టేనని నేను భావిస్తున్నా. నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మాభిమానం ముఖ్యమే అన్న విషయం అందరికీ తెలుసుకు. నేను పార్టీని గౌరవిస్తాను. పార్టీ అభివృద్ధి కోసం ఒక సామాన్య కార్యకర్తగా కృషి చేస్తా.” అని కొండా సురేఖ వివరణ ఇచ్చారు.