పోలీసులను వీఐపీల రక్షకులుగా కాకుండా… సేవకులుగా పరిగణిస్తున్నారుః రాజాసింగ్

మహమూద్ అలీపై సిఎం కెసిఆర్‌, డీజీపీలు చర్యలు తీసుకుంటారా?

Will HM be booked for ‘slapping a cop’, asks Raja Singh

హైదరాబాద్‌ః నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం కార్యక్రమంలో తన సెక్యూరిటీ సిబ్బందిపై హోంమంత్రి మహమూద్ అలీ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. సమయానికి ఫ్లవర్ బొకే అందించకపోవడంతో సెక్యూరిటీ చెంప ఛెళ్లుమనిపించారు. ఈ చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ… ఒక సాధారణ పౌరుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే పోలీసులు వేగంగా స్పందిస్తారని… ఆఘమేఘాల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని చెప్పారు. పోలీసు అధికారిపై చేయి చేసుకున్న మహమూద్ అలీపై ముఖ్యమంత్రి కెసిఆర్‌న, డీజీపీలు చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పోలీసులను వీఐపీల రక్షకులుగా కాకుండా… సేవకులుగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు.