ఏపీ,బీహార్ రాష్ట్రాల సీఎస్ ల‌కు ‘సుప్రీం’ నోటీసులు

విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme court

New Delhi: ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల సీఎస్ ల‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డంపై సుప్రీంకోర్టు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ మేర‌కు మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు హాజ‌రుకావాల‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కోవిడ్ బారిన పడి మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారంలో జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందించే విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పరిహారం చెల్లించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/