‘ది ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్ ..

కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి బరిలో నాగ చైతన్య తో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్..ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ , టీజర్స్ అంచనాలు రెట్టింపు చేయగా..శుక్రవారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

అండర్ వరల్డ్ అంతా ఘోస్ట్ ముందు మోకాళ్ళ మీద నిలబడి దయ చూపమని కోరడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రమాదంలో చిక్కుకున్న సోదరి.. 20 ఏళ్ల తర్వాత తమ్ముడు సహాయం కోరడంతో ఇంటర్ పోల్ ఆఫీసర్ అయిన విక్రమ్ (నాగార్జున) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన అక్క మరియు మేన కోడలిని కాపాడుకోడానికి అతను మొత్తం అండర్ వరల్డ్ తో వార్ కు సిద్దమవుతాడని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇన్నేళ్ల తర్వాత గుర్తొచ్చి పిలిచావా అని అడుగుతావా?.. అవసరం కోసం పిలిచావా అని అడుగుతావా?’ , ‘డబ్బు – సక్సెస్ సంతోషం కంటే శత్రువులనే ఎక్కువ సంపాదిస్తుంది’ వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ సంయుక్తంగా ఈ సినిమాని నిరించారు.