సుప్రీంకోర్టులో ఏపీకి చుక్కెదురు

ఏపీ సర్కార్ కు షాక్ ఇచ్చింది సుప్రీం కోర్ట్. రాష్ట్రంలో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. మళ్లించిన నిధులను తిరిగి రెండువారాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని జస్టిస్‌ ఎం.ఆర్‌షా ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు. రూ. 1,100 కోట్లను ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఖాతాలోకి జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే నాలుగు వారాల్లోగా సమస్యను పరిష్కరించాలని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ చర్య విపత్తు నిర్వహణ చట్టం మరియు విభజన చట్టం రెండింటికీ విరుద్ధమని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులను పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లింపుపై గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక ఏపీ సర్కార్ చేసిన నిధుల మళ్లింపు ను నిలుపుదల చేస్తూ గతంలోనే సుప్రీం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా పర్సనల్ డిపాజిట్ ఖాతాలకు మళ్లించిన డబ్బులు తిరిగి ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలంటూ ఆదేశించింది. మరి సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం 11వందల కోట్ల రూపాయల నగదును రాష్ట్ర విపత్తు నిర్వహణా నిధికి జమ చెయ్యాల్సి ఉంది. మరి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్ధిక సంక్షోభంలో ఈ డబ్బు జమ చేస్తుందా? లేదా అనేది చూడాలి.