రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు మొదలైన కాసేపటికే రేపటికి వాయిదాపడ్డాయి. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపు పై చర్చ జరపాలంటూ విపక్షాలు డిమాండ్ చేసాయి. అయితే సభను ఆర్డర్ లో పెట్టేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రయత్నించారు. అయినప్పటికీ సభ్యుల వినకపోవడంతో సభను రేపు(మంగళవారం) ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.

అంతకుముందు జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు పండిట్‌ శివకుమార్‌ శర్మ తదితరుల మృతి పట్ల రాజ్యసభ 2 నిమిషాలు మౌనం పాటించింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది.