సిద్దు తో హద్దులు దాటిన అనుపమ

ప్రేమమ్ బ్యూటీ అనుపమ డీజే టిల్లు 2 లో సిద్ధుతో కలిసి హాట్ హాట్ గా నటించిందని మోషన్ పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. ఇండస్ట్రీ లో రాణించాలంటే మడి కట్టుకొని ఉంటె కుదరదని లేటుగా గ్రహించింది అనుపమ..అందుకే ఈ మధ్య హాట్ హాట్ గా పోజులు ఇస్తూ కట్టిపడేస్తుంది. చిత్రసీమలో రాణించాలంటే నటన తో పాటు గ్లామర్ కూడా అవసరం..కానీ ఈరోజుల్లో నటన కంటే గ్లామర్ నే ఎక్కువగా చూస్తున్నారు ఆడియన్స్. తెరపై ఎంతగా అందాల ఆరబోత చేస్తే అంతగా ఛాన్సులు వస్తున్నాయి. ప్రస్తుతం రాణిస్తున్న భామలంతా కూడా అందాల ఆరబోతనే నమ్ముకొని ఛాన్సులు కొట్టేస్తున్నారు. కేవలం వెండితెర ఫై మాత్రమే కాదు సోషల్ మీడియా లోను సెగలు రేపుతున్నారు. అయితే అనుపమ మాత్రం మొదటి నుండి గ్లామర్ ను నమ్ముకోకుండా నటన కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. దీంతో అమ్మడి కంటే వెనుకాల వచ్చిన వారు టాప్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతుంటే అనుపమ మాత్రం అక్కడే ఉంది.

దీంతో అమ్మడు కూడా తన ఆలోచన మార్చుకుంది. గ్లామర్ నే నమ్ముకొని సోషల్ మీడియా లో రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రౌడీ బాయ్స్ మూవీ లో లిప్ లాక్ చేసి ఆశ్చర్య పరిచిన ఈ భామ.. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ గా వస్తోన్న టిల్లు స్క్వేర్ సినిమా లో రెచ్చిపోయినట్లు తెలుస్తుంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న ఈ సినిమాను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 15న సినిమా విడుదల కానుంది.

రెండు రోజులుగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది. దానికి కారణం సిద్దు కాదు.. అనుపమ అందాల ఆరబోత. కారులో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఆ ఫోటోలో కనిపిస్తున్న తీరును బట్టి అనుపమ సినిమాలో ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈ సినిమా తర్వాత అనుపమ మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందని నమ్ముతున్నారు ఆమె అభిమానులు.