మ‌నీల్యాండ‌రింగ్ కేసులో డీకే శివ‌కుమార్‌కు ఊరట

Supreme Court Dismisses Money Laundering Case Against DK Shivakuma

న్యూఢిల్లీ: క‌ర్నాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌ పై ఉన్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఊర‌ట దొరికింది. ఆ కేసులో ఆయ‌నపై విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని సుప్రీంకోర్టు తెలిపింది. 2018లో డీకేపై మ‌నీల్యాండ‌రింగ్ కేసు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే.మ‌నీల్యాండ‌రింగ్ కేసులో 2019లో డీకేను ఈడీ అరెస్టు చేసింది. ఆ త‌ర్వాత నెల రోజుల‌కు ఢిల్లీ హైకోర్టు ఆయ‌నకు బెయిల్ మంజూరీ చేసింది. బిజెపి రాజ‌కీయ క‌క్ష్య‌కు పాల్ప‌డుతోంద‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని గ‌తంలో శివ‌కుమార్ పేర్కొన్నారు.