ధోనీపై ఎప్పటికీ తగ్గని అభిమానం

అభిమానుల ప్రేమలో ఇరుక్కుపోయిన మిస్టర్‌ కూల్‌

MS Dhoni
MS Dhoni

మధ్యప్రదేశ్‌: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి ఫ్యాన్స్ అభిమానంలో తడిసి ముద్దయ్యారు. దాదాపు ఏడాదిగా బ్యాట్ పట్టకపోయినా, అతనిపై ఫ్యాన్స్ చూపించే ప్రేమ ఏ మాత్రం తగ్గలేదనడానికి నిదర్శనంగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019లో ఇంగ్లండ్ లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో న్యూజిలాండ్ తో సెమీస్ పోరులో ఇండియా ఓడిపోయిన అనంతరం, మరో అంతర్జాతీయ మ్యాచ్ ని ధోనీ ఆడలేదన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం వేసవిలో జరుగనున్న ఐపీఎల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ నాయకత్వం వహించనున్నారు. ఇదిలావుండగా ధోనీ సరదాగా బయటకు వెళుతూ, తనకెంతో ఇష్టమైన ఓపెన్ టాప్ జీప్ లో బయలుదేరాడు. అంతే ఎంత సెక్యూరిటీ ఉన్నా, ధోనీని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను నిలువరించడం సెక్యూరిటీకి తలకు మించిన భారమైంది. ధోనీ… ధోనీ… అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/