శ్రీలక్ష్మి పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై సీబీఐ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకు ఓబులాపురం మైనింగ్ కేసు విచారణ నిలిపివేసేలా సీబీఐ జడ్జిని ఆదేశించాలని శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం శ్రీలక్ష్మి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విచారణ చివరిదశలో ఉన్న సమయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

గతంలో శ్రీలక్ష్మి ఇదే తరహా అభ్యర్థనతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఆ తీర్పును సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే ఇక్కడా అదే పరిస్థితి ఎదురైంది. తెలంగాణ హైకోర్టు అన్ని అంశాలు పరిశీలించి తీర్పు ఇచ్చినట్టుగా అర్థమవుతోందని జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ స్పష్టం చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/