ఈరోజు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు , ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతుండగా..ఈరోజు బంగాళాఖాతంలో అండమాన్‌ సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో శనివారం దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి.. బలపడనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం మరింత బలపడి తుపాన్‌గా బలపడితే జవాద్‌ అని నామకరణం చేయనున్నారు. ఈ అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతకు ముందు ఏర్పడిన అల్పపీడనం బలహీనపడినా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.

దీని కారణంగా గత నాల్గు రోజులుగా తమిళనాడు లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అలాగే ఏపీలోని చిత్తూరు , నెల్లూరు , కడప , దక్షణ కోస్తా వంటి ప్రాంతాలలో భారీ వర్షాలు పడ్డాయి. ప్రస్తుతం కూడా తేలికపాటి వర్షం కొనసాగుతుంది. ఈ క్రమంలో మరో అల్పపీడనం అంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఖంగారు పడుతున్నారు. పంట చేతికి వస్తున్న క్రమంలో ఈ భారీ వర్షాలు పడడం తో వారు భాదపడుతున్నారు.