సినీ ప్రముఖుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ చిన్న కర్మ

సూపర్ స్టార్ కృష్ణ చిన్న కర్మ పూర్తి చేసారు. హార్ట్ ఎటాక్ తో సోమవారం అర్ధరాత్రి హాస్పటల్ లో చేరిన కృష్ణ..మంగళవారం ఉదయం కన్నుమూశారు. కృష్ణ కన్నుమూశారనే వార్త తెలిసి యావత్ చిత్రసీమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. కడసారి ఆయన్ను చూసేందుకు సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు పోటీపడ్డారు. ప్రభుత్వ లాంఛనాలతో బుధువారం ఆయన అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.

ఇక నిన్న గురువారం ఆయన చిన్న కర్మను పూర్తి చేసారు. కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, మహేష్ బాబు, మంజుల , నమ్రత , సుధీర్ బాబు, గల్లా జయదేవ్ తదితర కుటుంబ సభ్యులు కృష్ణకి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక అమెరికాలో ఉన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణతోపాటు దూర ప్రాంతాలలో ఉన్న ఇతరులు కూడా వచ్చి చిన్నకర్మకు హాజరయ్యారు. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, మహేష్ బాబు సన్నిహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని పూర్తి చేశారు.