గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నటి నగ్నంగా బైఠాయింపు..

హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద నటి సునీత బోయ నగ్నంగా కూర్చుంది. గీతా ఆర్ట్స్ ఎదుట అర్థరాత్రి వేళ ఆమె ప్రవర్తించిన తీరు సంచలనంగా మారింది. తెలుగులో పలు హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి, డిస్ట్రిబ్యూటర్ గా సత్తా చాటుతున్న బన్నీ వాసుపై ఆరోపణలు చేస్తూ సునీత బోయ గత కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశమిస్తానని చెప్పి నమ్మించి, వాడుకుని మోసం చేశాడంటూ సునీత పలుమార్లు ఆరోపించింది. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.. సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు కేసు కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. అప్పటి నుండి సైలెంట్‌గా ఉన్న సునీత ఇప్పుడు మరోసారి రచ్చ చేసింది.. బన్నీ వాసు తనను వేధిస్తున్నాడని..`తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదంటూ మొండికేసింది. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు.. ఓయువతి ఆమె ఒంటిమీద వస్త్రాలు కప్పింది..

నిత్యం రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ రోడ్డు మీద సునీత బోయ రచ్చ చేయడంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది.. గతంలోనూ ఇలానే పలుమార్లు హంగామా చేయడంతో పోలీసులు వచ్చి జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషనుకి తీసుకెళ్లడం కూడా జరిగింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని, కావాలనే బన్నీ వాసుని టార్గెట్ చేస్తుందని కూడా అంటున్నారు. కోర్టు కూడా బన్నీ వాసుకే సపోర్ట్ చేసింది.. అయినా సునీత మళ్లీ ఇలా చేసిందంటే ఆమె ఉద్దేశమేంటి? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.