డిసెంబర్‌ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా..?

నెల మారుతుందంటే ముందుగా బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవుతారు. ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి..ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు అనేవి చూస్తుంటారు. వాటిని బట్టి తమ బ్యాంకు పనులను చేసుకుంటుంటారు. ఇక డిసెంబర్ నెల రాబోతుంది. ఈ నెల లో ఏకంగా బ్యాంకులకు 13 రోజులు సెలవులు రాబోతున్నాయి.

డిసెంబర్ 3 – సెయింట్ జేవియర్స్ ఫీస్ట్ కారణంగా గోవాలో బ్యాంకు సెలవు.
డిసెంబర్ 4 – ఆదివారం.
డిసెంబర్ 10 – రెండో శనివారం అన్ని చోట్ల సెలవే.
డిసెంబర్ 11 – ఆదివారం.
డిసెంబర్ 12 – పా-టాగన్ నెంగ్మింజ సంగం కారణంగా మేఘాలయలో బ్యాంక్లు సెలవు.
డిసెంబర్ 18 – ఆదివారం
డిసెంబర్ 19 – గోవా విమోచన దినం కారణంగా గోవాలో బ్యాంకులు పని చెయ్యవు.
డిసెంబర్ 24 – నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు. .
డిసెంబర్ 25 – ఆదివారం
డిసెంబర్ 26 – క్రిస్మస్, లాసంగ్, నమ్సంగ్ కారణంగా మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకులు పని చేయవు.
డిసెంబర్ 29 – గురు గోవింద్ సింగ్ జి పుట్టినరోజు సందర్భంగా చండీగఢ్‌లో సెలవు.
డిసెంబర్ 30 – యు కియాంగ్ నంగ్వా కారణంగా మేఘాలయలో బ్యాంక్స్ సెలవు.
డిసెంబర్ 31 – నూతన సంవత్సర వేడుకలు మూలాన మిజోరంలో బ్యాంక్స్ పని చెయ్యవు.